‘ఇండియా’ కూటమి సమావేశంలో ఘటన
‘ఇండియా’ కూటమి సమావేశంలో ఘటన
హిందీ ప్రసంగాన్ని అనువదించాలన్న డీఎంకే నేత టీఆర్ బాలుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ తెలిసి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళవారం మూడు గంటలపాటు జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో జరిగిందీ ఘటన. కూటమిని ఉద్దేశించి నితీశ్ కుమార్ ప్రసంగిస్తున్నప్పుడు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఆర్ బాలు అక్కడే ఉన్నారు.
నితీశ్ హిందీ ప్రసంగం అర్థం కాకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే ఝా వైపు చూస్తూ.. నితీశ్ స్పీచ్‌ను ట్రాన్స్‌లేట్ చేయగలరా? అని అడిగారు. దీంతో ఆయన నితీశ్ అనుమతిని కోరారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మనం మన దేశాన్ని హిందూస్థాన్ అని పిలుస్తాం. హిందీ మన జాతీయ భాష. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌ను కోరారు.