అర్థరాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ షాపులు ఓపెన్
అర్థరాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ షాపులు ఓపెన్
మరో రెండు రోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, పర్మిట్ రూమ్‌లు, క్లబ్‌ల టైమింగ్ ను పొడిగించడానికి అనుమతించింది. మద్యం దుకాణాలు తెల్లవారుజామున 1 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని, పర్మిట్ రూమ్‌లు, బార్లు ఉదయం 5 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. శాంతిభద్రతల పరిశీలనల ఆధారంగా అనుమతులను తిరస్కరించే అధికారం కలెక్టర్‌కు ఉంది. ఈ పొడిగింపు పండుగ కాలంలో హోటళ్లు, క్లబ్‌ల వ్యాపారాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
వైన్ షాపులు డిసెంబర్ 24, 25, 31 తేదీల్లో తెల్లవారుజామున 1గంటల వరకు తెరచి ఉంచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. పర్మిట్ రూమ్ లు, బార్ లు ఉదయం 5గంటలకు ఓపెన్ చేసి ఉంచుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపింది. ఏవైనా గొడవలు, లేదా అవాంఛిత ఘటనలు జరిగితే అనుమతులను రిజెక్ట్ చేసే అధికారం కలెక్టర్ కు ఉందని కూడా పేర్కొంది.
ఈ టైమింగ్ పెంపుతో రెస్టారెంట్లు, హోటల్ అసోసియేషన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి, నవరాత్రుల తరహాలో.. క్రిస్మస్, న్యూ ఇయర్ లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ఆశిస్తున్నాయి.