అనకాపల్లి జిల్లా చోడవరంలో 31 రాత్రంతా బిర్యానీ, మందుపార్టీ చేసుకున్న 16 మంది విద్యార్థులు
అనకాపల్లి జిల్లా చోడవరంలో 31 రాత్రంతా బిర్యానీ, మందుపార్టీ చేసుకున్న 16 మంది విద్యార్థులు
అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హాస్టల్ నుంచి గోడదూకి బయటకు వచ్చి విద్యార్థులు మరో ఇద్దరు యువకులతో కలిసి హాస్టల్ పక్కనే నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు.
బిర్యానీ తెచ్చుకుని మందు తాగుతూ రాత్రంతా అక్కడే గడిపేశారు. శనివారం రాత్రి మొదలైన పార్టీ ఆదివారం కూడా కొనసాగింది. తింటూ, తాగుతూ అల్లరికి దిగడంతో గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఒకరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. తమను ఫొటోలు తీస్తున్న వారిని విద్యార్థులు హెచ్చరించడంతోపాటు మెకానిక్‌పై దాడిచేసి గాయపరిచారు.