పలు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన రాజేంద్రనగర్ పీఎస్

పలు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన రాజేంద్రనగర్ పీఎస్

పలు అంశాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన రాజేంద్రనగర్ పీఎస్

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పీఎస్ గా నిలిచింది. వివిధ అంశాల్లో పోలీస్ స్టేషన్ల పని తీరుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో రాజేంద్రనగర్ పీఎస్ అత్యుత్తమ ప్రతిభను కనపరిచి తొలి స్థానంలో నిలిచింది. అత్యధిక కేసులు నమోదవుతున్న పీఎస్ గా కొన్నేళ్లుగా ఈ పీఎస్ రికార్డు సృష్టించింది. కేసుల విచారణ, కేసులను ఛేదించడం, హత్య కేసుల్లో అత్యంత త్వరగా నిందితులను గుర్తించడం తదితర అంశాల్లో ఈ పీఎస్ ప్రతిభను కనపరిచింది. దేశంలోనే అత్యుత్తమ పీఎస్ గా ఎంపికయింది. ఈనెల 5న జయపురలో జరిగే కార్యక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్రబాబు అవార్డు తీసుకోనున్నారు.