'సలార్'లో గిరిజన అమ్మాయి ఎపిసోడ్ హైలైట్ .. పాత్రను పోషించిన ఫర్జానా
'సలార్'లో గిరిజన అమ్మాయి ఎపిసోడ్ హైలైట్ .. పాత్రను పోషించిన ఫర్జానా
'సలార్' సినిమా చూసినవారికి దేవా - వరదరాజ పాత్రలను పోషించిన చైల్డ్ ఆర్టిస్టులు గుర్తుంటారు. అలాగే వారితో పాటు మరో చైల్డ్ ఆర్టిస్ట్ ను ప్రేక్షకులు మరిచిపోలేరు. గిరిజన గూడానికి చెందిన అమ్మాయిగా 'సురభి' పాత్రలో కనిపించిన ఆమె పేరే ఫర్జానా. 'సురభి'ని చెరబట్టడానికి వచ్చిన ఒక దొర కొడుకును హీరో అంతం చేయడం అనే సీన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది.
ఆ సన్నివేశంలో నటించిన ఫర్జానా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మాది రాజమండ్రి .. ఇంతకుముందు నేను 'ఝాన్సీ' వెబ్ సిరీస్ లో చేశాను. ఆ పాత్ర కారణంగా నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆడిషన్స్ కి రమ్మంటే వెళ్లాను. సినిమాలో ఉన్న సీన్ నే అక్కడ నాతో చేయించారు .. ఆ తరువాత ఓకే అన్నారు" అని అంది.
"ప్రశాంత్ నీల్ గారు నన్ను తీసుకుని వెళ్లి ప్రభాస్ కి పరిచయం చేశారు. ప్రభాస్ గారిని చూడగానే నాకు చాలా భయమేసింది. ఆయన నన్ను చూడగానే టెన్షన్ పడిపోయాను. కానీ ఆయన చాలా కూల్ గా మాట్లాడటంతో కంగారు తగ్గిపోయింది. నేను స్క్రీన్ పై కనిపించగానే నాతో పాటు అమ్మానాన్నలు కూడా చాలా థ్రిల్ ఫీలయ్యారు" అని చెప్పింది.