సంక్రాంతి బరిలో నిలిచిన 'సైంధవ్'..తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న వెంకీ
సంక్రాంతి బరిలో నిలిచిన 'సైంధవ్'..తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న వెంకీ
యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథలపై వెంకటేశ్ తనదైన మార్కు చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక జోనర్ లోనే ఆయన 'సైంధవ్' సినిమాను చేశారు. శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ ఆయనను 'సైకో' అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి, ఈవెంట్ ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈవెంటులో వెంకటేశ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా తరువాత నన్ను 'సైంధవ్' అని పిలవండి .. లేదంటే 'సైకో' అని పిలవండి. న్యూ ఇయర్లో ఈ సినిమా నుంచి ట్రైలర్ వదలడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం" అని అన్నారు.
"75వ సినిమాగా 'సైంధవ్' చేయడం ఆనందంగా ఉంది. ఈ సారి పూర్తి డిఫరెంట్ గా అనిపించే సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి ఒక కథగానే ఇది నా ముందుకు వచ్చింది. సినిమా మొదలైన 15వ నిమిషం నుంచే కథలో ఇన్వాల్వ్ అవుతారు. నా కెరియర్లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.