లడఖ్ కార్గిల్‌లో భూకంపం..
లడఖ్ కార్గిల్‌లో భూకంపం..
లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో సోమవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 3:48 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. దీని కారణంగా ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.