రేపు కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు జగన్
రేపు కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు తెలంగాణకు రానున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో కాలుజారి కిందపడి గాయపడిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రిలో ఉండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు.
కాగా, ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రేపు హైదరాబాద్ వస్తున్నారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు.
ఈరోజు జగన్ ను కలవనున్న వైఎస్ షర్మిల
చాలా కాలం తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలవనున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న షర్మిల... తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈరోజు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందిస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. రేపు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆమె సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్న సంగతి తెలిసిందే.