రాహుల్ గాంధీపై రాజ్యసభ చైర్మన్ ఫైర్
రాహుల్ గాంధీపై రాజ్యసభ చైర్మన్ ఫైర్
పార్లమెంట్ వెలుపల తనను అనుకరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని, చిత్రీకరించిన ఎంపీ రాహుల్ గాంధీని రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ మంగళవారం (డిసెంబర్19)న తీవ్రంగా విమర్శించారు. లోక్ సభ, రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలను ఊకుమ్మడిగా సస్సెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల నిరసనలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ధన్ కర్ అనుకరించడం, రాహుల్ దానిని చిత్రీకరించారు.
దీనిపై రాజ్యసభ చైర్మన్ తీవ్రంగా స్పందించారు, ఒక ఎంపీ అవహేహణ చేయడం..దానిని మరో ఎంపీ చిత్రీకరంచడం..సిగ్గుచేటు, హాస్యాస్పదం..ఇది సరియై నది కాదు అంటూ ధన్ ఖర్అన్నారు.
గత కొన్ని రోజులుగా పలుమార్లు వాయిదా పడిన పార్లమెంట్ కార్యకలాపాలను తృణ మూల్ కాంగ్రెస్ ఎంపీ వర్ణిస్తూ అనుకోకుండా రాజ్యసభ చైర్మన్ ను అనుకరించారు. డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రటనక చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేశాయి.
లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.