రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికపూడి
రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికపూడి
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులను ఇచ్చారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు.
కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాసరావు... వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, శ్రీనివాసరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.