రచిన్ కనీస ధర రూ.50 లక్షలు... రూ.1.8 కోట్లకు చెన్నై సొంతం

రచిన్ కనీస ధర రూ.50 లక్షలు... రూ.1.8 కోట్లకు చెన్నై సొంతం

రచిన్ కనీస ధర రూ.50 లక్షలు... రూ.1.8 కోట్లకు చెన్నై సొంతం

ఇటీవల వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అందరూ భావించారు. భారత గడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్ లో రచిన్ రవీంద్ర 3 సెంచరీలు బాది పరుగులు వెల్లువెత్తించాడు. 

దాంతో, ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడతాయని, తద్వారా కళ్లు చెదిరే ధర వస్తుందని అంచనా వేశారు. కానీ అవేవీ జరగలేదు. నేటి ఐపీఎల్ మినీ వేలంలో రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు కాగా... అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బాగా చవకగా రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఇక, టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ వేలంలో రూ.4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో పడ్డాడు. శార్దూల్ ఠాకూర్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. శార్దూల్ గతంలోనూ చెన్నై జట్టుకు ఆడాడు.