మలయాళంలో హిట్ కొట్టిన 'నాయట్టు' .. తెలుగు రీమేక్ గా 'కోట బొమ్మాళి పీఎస్'
మలయాళంలో హిట్ కొట్టిన 'నాయట్టు' .. తెలుగు రీమేక్ గా 'కోట బొమ్మాళి పీఎస్'
శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'కోట బొమ్మాళి పీఎస్', నవంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, తేజ మార్ని దర్శకత్వం వహించాడు. రంజిన్ రాజ్ సంగీతాన్ని సమకూర్చాడు.
మలయాళంలో 'నాయట్టు' సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారు. పోలీసులను పోలీసులే వెంటాడే కాన్సెప్ట్ తో వచ్చిన 'నాయట్టు' మలయాళంలో సూపర్ హిట్టు. తెలుగులో మాత్రం ఈ కాన్సెప్ట్ యావరేజ్ అనిపించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ద్వారా ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. 'కోటబొమ్మాళి పీఎస్'లో శ్రీకాంత్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ పోలీసులుగా పనిచేస్తూ ఉంటారు. ఒక సంఘటనలో ఈ ముగ్గురినీ డిపార్టుమెంటు నిందితులుగా భావిస్తుంది. వారిని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ రంగంలోకి దిగుతుంది.