భార్యకు నరకం చూపించిన ప్రముఖ యూట్యూబర్
భార్యకు నరకం చూపించిన ప్రముఖ యూట్యూబర్
మామూలుగా చిన్న తప్పు చేస్తేనే మన చుట్టూ ఉన్న వారికి ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తులు ఏమైనా తప్పుడు లేదా మంచి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా.. వెంటనే వైరల్ అవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అదే తరహాలో ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. అతను చేసిన తప్పేంటంటే తన భార్య యానికా బింద్రాపై దాడి చేయడమే.
వివేక్, యానిక డిసెంబర్ 6, 2023 న వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లైన 8 రోజులకే అంటే డిసెంబర్ 14 న నోయిడా సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. (తన భార్య) బాధితురాలి సోదరుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఈ ఫిర్యాదులో, వివేక్ బింద్రా తన తల్లితో గొడవకు దిగగా.. ఆ సమయంలో మధ్యలో తన సోదరి జోక్యం చేసుకుందని ఆమెపై దాడి చేశాడని పేర్కొన్నాడు. అంతే కాదు ఆమెను దుర్భాషలాడాడని, తీవ్రమైన శారీరక దౌర్జన్యం చేశాడని, ఫలితంగా ఆమె శరీరమంతా గాయాలయ్యాని ఆరోపించాడు.