ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్' .. 3 రోజుల్లో 402 కోట్లు!
ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్' .. 3 రోజుల్లో 402 కోట్లు!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్' ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్ నుంచి ఇంతకు ముందు వచ్చిన రెండు .. మూడు పాన్ ఇండియా సినిమాలు నిరాశపరచడం వలన, ఈ సినిమా విషయంలో అభిమానులు మరింత ఆసక్తిని కనబరిచారు. ఇది భారీ వసూళ్లను రాబట్టాలని ఆశించారు.
అందుకు తగినట్టుగానే ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తరువాత అభిమానులు కోరుకున్నట్టుగా ప్రభాస్ కనిపించాడు. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా .. ఫైట్స్ పరంగా ఈ సినిమా భారీతనాన్ని ఆవిష్కరించింది. రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను ప్రభాస్ కెరియర్ లో వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో 402 కోట్లను వసూలు చేసింది. ఈ రోజున క్రిస్మస్ సెలవు దినం కావడం వలన వసూళ్ల జోరు తగ్గే అవకాశం లేదు. ఆ తరువాత కూడా ఇదే జోరు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చాలా వేగంగానే ఈ సినిమా 1000 కోట్ల జాబితాలో చేరిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సలార్ పార్ట్-2 ఇంకా సూపర్ గా ఉంటుంది: ప్రభాస్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ ను ఈ సినిమా షేక్ చేస్తోంది. ప్రభాస్ కెరీర్లో మరో సూపర్ హిట్ పడింది. తాజాగా హాలీవుడ్ కు చెందిన ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సలార్ మూవీ కథ తనకు ఎంతో నచ్చిందని... అందుకే కథను విన్న వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. తన కెరీర్లో 'బాహుబలి' ఇక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని... ఆ తర్వాత సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నానని... అందులో భాగంగానే 'సలార్' సినిమాకు ఓకే చెప్పానని అన్నారు.
సలార్ పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందని తెలిపారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోందని... బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా గుర్తిస్తున్నారని అన్నారు.