నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ
నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహారాష్ట్రలోని నాగపూర్లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా నాగపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరు కానున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షలమంది వస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో నాగపూర్లో కాంగ్రెస్ శ్రేణులు... రేవంత్ రెడ్డి సహా మంత్రులకు ఘన స్వాగతం పలికారు.