తిరుపతి వెంకన్న స్థానాన్ని ఆక్రమించనున్న అయోధ్య రాముడు ..
తిరుపతి వెంకన్న స్థానాన్ని ఆక్రమించనున్న అయోధ్య రాముడు ..
తిరుపతి వెంకన్న స్థానాన్ని ఆక్రమించనున్న అయోధ్య
రాముడు.. దేశానికే తలమానికం కానున్న యూపీ..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది ప్రత్యక్షంగా.. కోట్లాది మంది టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించి.. పులకించిపోయారు. జనవరి 24 నుంచి అంటే బుధవారం నుంచి సామాన్య భక్తులు అయోధ్య రాముణ్ని సందర్శించుకోవచ్చు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడికి కట్టిన గుడి కావడంతో.. ఆ బాల రాముణ్ని సందర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు.