జ్ఞానవాపి మసీదు కేసు
జ్ఞానవాపి మసీదు కేసు
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను కోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జ్ఞానవాపి మసీదు కేసు(Gyanvapi Masjid Case)లో ముస్లింలు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను కోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ హిందువులు పిటిషన్ వేశారు. ఆ పిటీషన్ ఆధారంగానే ఆ మసీదులో సైంటిఫిక్ సర్వే చేపట్టారు. ఆ నివేదికను కూడా ఇటీవల కోర్టుకు సమర్పించారు.
అయితే హిందువుల పిటీషన్లను సవాల్ చేస్తూ ముస్లింలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు ఇవాళ కొట్టిపారేసింది. ముస్లింలు మొత్తం అయిదు పిటీషన్లు దాఖలు చేశారు. సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ ఆ పిటీషన్లు వేశాయి.