గైక్వాడ్ వేలి గాయం తీవ్రత కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ
గైక్వాడ్ వేలి గాయం తీవ్రత కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రుతురాజ్ కుడి చేతి వేలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి స్కానింగ్ నిర్వహించారు. బీసీసీఐ వైద్య బృందం సిఫారసు మేరకు రుతురాజ్ గైక్వాడ్ ను జట్టు నుంచి తప్పించారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయాలని రుతురాజ్ కు సూచించారు. ఇక, టీమిండియాలో రుతురాజ్ స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది.
ఐపీఎల్ కూ దూరం కానున్న హార్దిక్ పాండ్యా!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ సీజన్ లో పాండ్యా ఆడడంలేదని సమాచారం. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే బయటకు వచ్చిన పాండ్యా.. తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మరే మ్యాచ్ లోనూ ఆడలేదు.
గాయం నుంచి పాండ్యా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ కు కూడా దూరమయ్యాడు. ఈ విషయంపై ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదలైంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో పాండ్యా పాల్గొంటాడా లేదా అనే విషయంపై కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని, ఐపీఎల్ కు దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించుకున్నాడని అనధికారిక సమాచారం.