కేసీఆర్ ను పరామర్శించిన జగన్ .. ఆహ్వానం పలికిన కేటీఆర్
కేసీఆర్ ను పరామర్శించిన జగన్ .. ఆహ్వానం పలికిన కేటీఆర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది.
రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలోనే ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ కలవనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్తుండటం గమనార్హం