ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 టాప్ 50లో జూనియర్
ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 టాప్ 50లో జూనియర్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారు. ఈ సినిమా ద్వారా ఇరువురు పలు ఘనతలను సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ కమిటీలో స్థానం కూడా సంపాదించాడు. పలు ఇంటర్నేషనల్ మేగజీన్స్ ఫ్రంట్ పేజ్ లపై మెరిశాడు. తాజాగా మరో ఘనతను సాధించాడు.
ఏషియన్ వీక్లీ న్యూస్ మేగజీన్ కు బ్రిటన్ లో ఎంతో పాప్యులారిటీ ఉంది. తాజాగా ఏషియన్ వీక్లీ న్యూస్... ఈస్టర్న్ ఐ 2023 పేరిట టాప్ 50 ఏషియన్ స్టార్లను ప్రకటించింది. ఇందులో తారక్ కు కూడా స్థానం దక్కింది. ఈ లిస్ట్ లో తారక్ 25వ స్థానంలో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే... తారక్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.