ఎన్ఆర్ఐ యశస్వికి పాస్ పోర్ట్ ఇచ్చేయాలన్న ఏపీ హైకోర్టు
ఎన్ఆర్ఐ యశస్వికి పాస్ పోర్ట్ ఇచ్చేయాలన్న ఏపీ హైకోర్టు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఎన్ఆర్ఐ యశస్విపై దాఖలైన కేసులో ఏపీ హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. యశస్వి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్ పోర్ట్ ను ఆయనకు తిరిగిచ్చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. పాస్ పోర్టు ఇప్పించాలంటూ యశస్వి దాఖలు చేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తూ ఈ ఆదేశాలు వెలువరించింది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇటీవల భారత్ కు వచ్చిన యశస్విని సీఐడీ అధికారులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో యశస్వి దిగిన వెంటనే అదుపులోకి తీసుకుని, ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై యశస్వి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.