ఈ నది ఎర్రగా మారింది..!
ఈ నది ఎర్రగా మారింది..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల వనరుల్లో నీటి నాణ్యత సమస్య అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా ఎదురవుతోన్న సమస్యలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నివారణలు మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా నది అంటే నీలి రంగు లేదంటే తెలుపు రంగులో కనిపిస్తుంది. కానీ నది ఎప్పుడైనా పూర్తిగా ఎరుపు రంగులోకి మారడం చూశారా. ఈ విషయం వింతగా అనిపించినప్పటికీ.. కాలుష్య కారకాల కారణంగా ఓ నదిలోని నీలి రంగు నీరు కాస్తా.. ముదురు గులాబీ అంటే బీట్ రూట్ రంగులోకి మారింది.
రష్యాలోని ఇస్కిటిమ్కా అనే పేరు గల ఓ నది అకస్మాత్తుగా ఎరుపు రంగులోకి మారింది. ఇందుకు గల కారణాలపై అధికారులు పరిశోధనలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నదిలోని నీళ్లు తమ కిమెరోవో పారిశ్రామిక ప్రాంతంలోకి వెళుతుండడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో ఈ రకంగా మారిన ఈ నదికి సంబంధించిన నీటి ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేశాయి.
ఈ సంఘటన జూన్ 2020లో ఉత్తర సైబీరియన్ నగరమైన నోరిల్స్క్ వెలుపల ఉన్న పవర్ స్టేషన్లో డీజిల్ రిజర్వాయర్ కూలిపోవడంతో అనేక ఆర్కిటిక్ నదులు ఎర్రగా మారాయి. ఈ విపత్తు 15,000 టన్నుల ఇంధనాన్ని నదిలోకి, 6000 టన్నుల మట్టిలోకి విడుదలయ్యేలా చేసింది, ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గ్రీన్‌పీస్ రష్యా ఆర్కిటిక్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిదని, పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పారు..