ఆకలి వేసి అలసిపోయినప్పుడు
ఆకలి వేసి అలసిపోయినప్పుడు
చలికాలంలో ఏది తిన్నా, తాగినా కాస్త వెచ్చగా ఉంటే బాగుండు అనుకుంటారు. ఇక స్నాక్స్ అయితే వేడివేడిగా కావాల్సిందే. వేగించిన బజ్జీలు, బోండాలు, సమోసాల్లాంటివి ఇష్టంగా తింటారు. కానీ, అవి తింటే క్యాలరీలు పెరుగుతాయనే భయం. మరి అలాంటి వాళ్లకు వింటర్ ఫ్రెండ్లీ స్నాక్ ఏంటో తెలుసా? పిస్తా!
రోజుకు గుప్పెడు పిస్తా తింటే చాలు. నూనెలో డీప్ ఫ్రై చేసినవి, ఎక్కువ క్యాలరీలు ఉండే స్నాక్స్ జోలికి పోవద్దు. వాటి బదులు పిస్తా తినాలి. వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పిస్తా పప్పులు తింటే బరువు పెరగకపోగా. తగ్గుతారు. పిస్తాలో ఫైబర్ కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. వీటిని ఫలానా టైంలోనే తినాలని రూల్ లేదు.
ఆకలి వేసినప్పుడు, అలసిపోయినప్పుడు తినొచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండడం వల్ల కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీటిలో విటమిన్- 6 కూడా పుష్కలంగా ఉంటుంది. దాంతో పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ రాకుండా చేస్తుంది. క్వీనొవా, సోయాబీన్ లతోపాటు కాలిఫోర్నియా పిస్తాలు పూర్తిగా శాకాహారమని 2020లో చేసిన ఒక స్టడీ.